గ్యాస్ సమస్య.. చెప్పడానికి చిన్నదిగా కనిపించినా.. ఈ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యేవారు పది మందిలో ఒకరు ఉంటారంటే అతిశయోక్తి కాదు. కడుపు ఉబ్బరంగా.. ఎక్కువ తినాలంటే భయం.. నలుగుట్లో ఇబ్బంది. అయితే రెగ్యులర్.. కామన్ గా వచ్చే గ్యాస్ ప్రాబ్లమ్ వేరు.. 24 గంటలూ.. కడుపులో గాలి బడుగలా తయారయ్యే పరిస్థితి వేరు. గ్యాస్ ప్రాబ్లం అంటే ఇదే. దీన్ని తగ్గించుకోవాలని డాక్టర్ల చుట్టూ తిరిగుతూ తగ్గినట్లే తగ్గి కడుపులో మంటతో కూడిన సమస్యతో బాధపడుతున్న వారి కోసం గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చెప్పే సొల్యూషన్ చాలా సింపుల్ గా.. ఈజీగా ఫాలో అయ్యేలా ఉంది. అదేంటో తెలుసుకుందాం.
గ్యాస్ సమస్య తగ్గాలంటే ముందు గట్ హెల్త్ ను సెటిల్ చేసుకోవాలని అంటున్నారు డాక్టర్లు. అయితే ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ తినే ఈ రోజుల్లో.. ప్రోబయాటిక్, ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకునే వారు తక్కువై పోయారు. అంటే మంచి బ్యాక్టీరియా కలిగిన, పులియబెట్టిన ఆహారం తో పాటు పీచు పదార్థాలు జీర్ణాశయాన్ని క్లీన్ చేయడమే కాకుండా గట్ హెల్త్ ను కాపడటంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సౌరభ్ సేథీ షేర్ చేసిన హై ఫైబర్ సలాడ్ ఈ మధ్య బాగా పాపులర్ అవుతోంది. గట్ హెల్త్ ను కాపడటంలో చాలా బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. తన హైఫైబర్ బౌల్ తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటూ ఆయన తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. తయారు చేయడానికి ఈజీ అని.. ఐ క్యాచ్ గా కలర్ ఫుల్ గా ఉండే పదార్థాలు.. న్యూట్రిషన్ స్థాయిని పెంచడంతో పాటు గట్ హెల్త్ ను కాపాడుతాయని చెబుతున్నారు.
- ఎలా తయారు చేసుకోవాలి..?
డాక్టర్ షేర్ చేసిన హై ఫైబర్ బౌల్ లో ఏమేమున్నాయి.. ఎలా తయారు చేసుకోవాలి అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఈ బౌల్ లో ఫస్ట్ చెప్పుకోవాల్సినవి.. పీచుపదార్థం , ప్రోటీన్‌తో నిండిన శనగలు, నల్ల బీన్స్. వీటికి తోడు స్వీట్‌కార్న్ న్యాచురల్ స్వీట్ ను అందిస్తుంది. అయితే టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు తాజాదనాన్ని, కరకరలాడే అనుభూతిని అందిస్తాయి.
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో పదార్థం అవకాడో. ఇది ఫైబర్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులను (గుడ్ ఫ్యాట్) అందిస్తుంది.
నిమ్మరసం, ఉప్పు, మిరియాలతో చేసిన సాధారణ డ్రెస్సింగ్‌తో అన్నీ కలిసిపోతాయి. మరింత రుచిని ఇష్టపడేవారు ఒరేగానో లేదా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు.
- ఫైబర్ ఎందుకు అంత ముఖ్యం:
చలా మందిలో లోపించే పోషకం పీచుపదార్థం. జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడటంలో పీచుపదార్థం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది పేగు కదలికలను నిర్వహించడానికి, పేగులోని గుడ్ బ్యాక్టీరియాకు సహాయం చేయడానికి తోడ్పడుతుంది. భోజనం తర్వాత కడుపు నిండిన భావన కలగటానికి దోహదపడుతుంది. అయినప్పటికీ, చాలా మంది తగినంత పీచుపదార్థం తీసుకోరు. మీ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోకుండానే, పీచుపదార్థం పెంచుకోవడానికి డాక్టర్ సేథీస్ బౌల్ బెస్ట్ ఆప్షన్.
శనగలు, నల్ల బీన్స్ జీర్ణక్రియకు సహాయపడే ప్రోటీన్ , ఫైబర్‌ను అందిస్తాయి, అలాగే ఆకలిని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. టమోటాలు, మిరపకాయలు, ఉల్లిపాయలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, అయితే జలపెనోలు చిక్కటి సాస్‌ల అవసరం లేకుండా రుచిని అందిస్తాయి. అవకాడో గుండెకు మేలు చేసే కొవ్వులను అందిస్తుంది.
ఈ పదార్థాలన్నీ కలిసి, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలను అందిస్తాయి. శరీరానికి సహజంగా మద్దతు ఇచ్చే పౌష్టికమైన, పీచుపదార్థం అధికంగా ఉండే ఆహారాల వైపు తిరిగి వెళ్లడమే ఉత్తమమైన మార్గమని డాక్టర్ చెబుతున్నారు.
