
హనుమాన్ డైరెక్టర్ క్రియేట్ చేసిన ‘ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)’నుంచి మూడో సినిమా వస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఈ మూవీకి ‘మహా కాళీ’ (MAHAKALI) అనే టైటిల్‌ను ఖారారు చేశారు మేకర్స్. మహా కాళీ టైటిల్ రివీల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలోనే ఇవాళ (సెప్టెంబర్ 30న) ‘మహా కాళీ’ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ప్రెస్టీజియస్ మైథికల్ థ్రిల్లర్లో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీలో ‘అసురగురు శుక్రాచార్య’ పాత్రలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
‘‘దేవతల నీడలలో, తిరుగుబాటు యొక్క ప్రకాశవంతమైన జ్వాల ఉదయించింది. మహాకళి నుండి శాశ్వతమైన ‘అసురగురు శుక్రాచార్య’గా నిగూఢమైన అక్షయ్ ఖన్నాను చూపించబోతున్నాం’’ అని ప్రశాంత్ ట్వీట్ చేశాడు. 🔱
In the shadows of gods,
— Prasanth Varma (@PrasanthVarma) September 30, 2025
rose the brightest flame of rebellion 🔥
Presenting The Enigmatic #AkshayeKhanna as the eternal 'Asuraguru SHUKRACHARYA' from #Mahakali 🔱❤️🔥@PujaKolluru @RKDStudios #RKDuggal #RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/mclj39Q8z9
నటుడు అక్షయ్ ఖన్నా.. తెలుగు ఆడియన్స్కు గుర్తుండకపోవొచ్చు.. ? అది తప్పు. ఎందుకంటే, బాలీవుడ్ సూపర్ హిట్ 'ఛావా' మూవీలో ఔరంగజేబు పాత్రలో నటించి దుమ్మురేపాడు. తనదైన నటనతో అదరగొట్టేశారు. ఈ క్రమంలోనే ఛావాతో క్రియేట్ చేసిన ఆ విలనిజం.. తెలుగు ఆడియన్స్లో బాగా గుర్తుండిపోయింది.
ఇపుడు మహాకాళితో ఎలాంటి ప్రకంపనలు క్రియేట్ చేయనున్నాడనే ఆసక్తి నెలకొంది. గతంలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో హీరోగా చేసిన అక్షయ్ ఖన్నా.. తన సెకండ్ ఇన్నింగ్స్లో ప్రధాన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం విలన్, గెస్ట్, సపోర్టింగ్ రోల్స్ వంటివి చేస్తూ బాగానే రాణిస్తున్నాడు.
మహా కాళీ (MAHAKALI):
భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలే రిలీజ్ చేసిన మహా కాళీ పోస్టర్ ని గమనిస్తే.. 'ఒక అమ్మాయి తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. బ్యాగ్రౌండ్లో గుడిసెలు, దుకాణాలు దర్శనమివ్వడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే ఇందులో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చూడవచ్చు. బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ మధ్యలో డైమండ్ లాంటి ఆకారాన్ని చూపించారు.
ఇలా ఈ ఒక్క పోస్టర్తో ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.