పేపర్ లీకేజీ కాదు.. అమ్ముకున్నరు:  ఆకునూరి మురళి

పేపర్ లీకేజీ కాదు.. అమ్ముకున్నరు:  ఆకునూరి మురళి

విద్యను నిర్వీర్యం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు.మార్చి 26వ తేది ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో 'తెలంగాణ బచావో' సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకునూరి మురళి పాల్గొన్నారు. TSPSC పరీక్ష పత్రాలు లీకేజీ కాదని కేసీఆరే వాటిని అమ్ముకున్నారని మండిపడ్డారు. కల్లకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను కాపాడుకోవడం కోసం మనం ఒక నెట్ వర్క్ లాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ వచ్చాక రూ.16 లక్షల కోట్ల రూపాయల సంపద ఖర్చు అయ్యిందని.. సింగపూర్ కన్నా 100 రేట్ల సంపద తెలంగాణలో ఉందన్నారు రిటైర్డ్​ ఐఏఎస్ ఆకునూరి మురళి. రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టి ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ గురించి క్యాబినెట్ మీటింగ్ పెట్టారని ధ్వజమెత్తారు. రూ.60 వేల కోట్లతో రాష్ట్రంలో 3 వేల కార్పొరేట్ స్థాయి స్కూల్స్ స్థాపించవచ్చని విమర్శించారు ఆకునూరి మురళి. రూ.60 వేల కోట్లతో 119 నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ అపోలో లాంటి హాస్పిటల్స్ ఏర్పాటు చేయవచ్చన్నారు. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలకు ఇండ్లు లేవు..15 వేల మంది చెట్ల కిందే ఉంటున్నారు. ప్రభుత్వం పేద ప్రజల అభివృద్దిని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు ఆకునూరి మురళి.