అలా నిన్ను చేరి.. ప్రతి ఒక్కరిలో జరిగే కథ

అలా నిన్ను చేరి..  ప్రతి ఒక్కరిలో జరిగే కథ

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌‌లో మారేష్ శివన్ తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు  మారేష్ శివన్ మాట్లాడుతూ ‘ఈ కథను 2012లో రాశాను.  అప్పటి పరిస్థితుల ఆధారంగానే సినిమా ఉంటుంది.  ప్రతి మనిషిలో జరిగే కథ ఇది. ప్రేమ, లక్ష్యం ఒకేసారి ఎంచుకోవాల్సి వస్తే ఏం చేస్తారు.. ఏం చేయాలి అనే మెసేజ్‌‌తో మూవీని తీశాను. ఈ చిత్రాన్ని చూసిన తరువాత కొంత మందిలోనైనా మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఎలిమెంట్స్ ఉంటాయి. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణతో పాటు పలువురు సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇందులో నటించారు’ అని చెప్పారు.