ఆలేరు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆగని అసమ్మతి లొల్లి

ఆలేరు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆగని అసమ్మతి లొల్లి
  • పట్టు నిలుపుకునేందుకు గొంగిడి దంపతుల ప్రయత్నం
  • కలిసి రాకుంటే వేటు తప్పదని హెచ్చరికలు


యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గ టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రగిలిన చిచ్చు ఆరడం లేదు. పార్టీపై పట్టు నిలుపుకునేందుకు గొంగిడి దంపతులు ఓ వైపు ప్రయత్నం చేస్తుండగా, మరో వైపు ఇటీవల బహిష్కరణకు గురైన పడాల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసమ్మతివాదులు, గతంలో సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన లీడర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అధికార పార్టీలో అసమ్మతి పోరు రోజురోజుకు పెరుగుతోంది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కమిటీ ఎన్నిక సందర్భంగా డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిపై అసంతృప్తివాదులు దాడి చేశారు. ఈ దాడికి ఆలేరు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడాల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణమని ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన తన మద్దతుదారులతో కలిసి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిశారు. కొత్తగా ఎన్నికైన గ్రామ కమిటీల సభ్యులను కలిసి, వారంతా తనవైపే ఉన్నారని చూపుతూ ఇటీవల బలప్రదర్శన సైతం నిర్వహించారు. దీంతో పాటు గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆకవరం మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో పాటు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిపై అసంతృప్తితో ఉన్న వారితో చర్చలు జరుపుతున్నారు. వీరందరినీ కలుపుకొని కూటమి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కొత్తగా ఎన్నికైన గ్రామ కమిటీ బాధ్యులతో నిర్వహిస్తున్న జెండా పండుగకు వెళ్లకుండా ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పడాల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ పెద్ద లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన గొంగిడి దంపతులు
సస్పెండ్​ చేసిన తర్వాత మౌనంగా ఉంటాడని అనుకున్న పడాల.. నియోజకవర్గ పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తుండడంతో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు. నియోజకవర్గంపై పట్టు నిలుపుకుంటూ వస్తున్న గొంగిడి దంపతులకు పడాల ప్రయత్నాలు ఇబ్బందికరంగా మారాయి. దీంతో గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మద్దతుదారులు తుర్కపల్లి మండలంలో ఇటీవల భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అసమ్మతివాదులకు గట్టి వార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. పార్టీ కారణంగానే పదవులు వచ్చాయని, అందరూ కలిసి రావాల్సిందేనని హితవు పలికారు. అలాకాకుండా పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారికి మద్దతుగా నిలిస్తే పదవులు ఊడిపోతాయని హెచ్చరించారు. అవసరమైతే కొత్త కమిటీలు వేస్తామని కూడా ప్రకటించారు. 
ప్రయారిటీ లేదంటున్న లీడర్లు
తుర్కపల్లిలో మొదలైన లొల్లి కారణంగా పార్టీ పదవులు రాని వారు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఆలేరు, రాజాపేట, ఆత్మకూరు(ఎం) మోటకొండూరు మండలాలతో, పలు గ్రామాల్లో ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి పదవులు దక్కలేదు. దీంతో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెల్లిగా వర్గాలు తయారవుతున్నాయి. గొంగిడి దంపతులు తమకు అనుకూలంగా ఉన్నవారికి మూడు నుంచి నాలుగు సార్లు పదవులు ఇచ్చుకున్న విషయాన్ని అసంతృప్తివాదులు లేవనెత్తుతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమకు సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.