పోలీసు బందోబస్తుతో.. ఓటర్లకు బీర్లు, బిర్యానీ ప్యాకెట్లు పంచిన బీజేపీ ఎంపీ

పోలీసు బందోబస్తుతో..  ఓటర్లకు బీర్లు, బిర్యానీ ప్యాకెట్లు పంచిన బీజేపీ ఎంపీ
  • పోలీసు బందోబస్తు మధ్య పంచిన కర్నాటక బీజేపీ ఎంపీ

న్యూఢిల్లీ: కర్నాటకు చెందిన ఓ బీజేపీ ఎంపీ.. తనను గెలిపించిన నియోజకవర్గ ఓటర్లకు బహిరంగ ప్రదేశంలో బీర్లు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయి. ఈ అంశం కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కర్నాటకలోని చిక్కబళ్లాపూర్ లోక్​సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కే సుధాకర్‌‌‌‌.. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ అభ్యర్థి ఎంఎస్‌‌‌‌ రక్షా రామయ్యపై 1.6 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 

అయితే, సుధాకర్‌‌‌‌  ను ఎంపీగా గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపేందుకు పార్టీ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు నిర్ణయించారు. అందులో భాగంగా ఓ పెద్ద గ్రౌండ్​లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాదాపు 20 వేల మందికి మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరణ ఇవ్వాలని కర్నాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ డిమాండ్​చేశారు. ఇదీ బీజేపీ సంస్కృతి అని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఎక్సైజ్ పాలసీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకుంటుందని, అంతకంటే ముందు బీజేపీ దీనిపై సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.

మద్యం పంపిణీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: ఎంపీ సుధాకర్​

పార్టీలో మద్యం పంపిణీపై తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ సుధాకర్ పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వాహకులు మద్యం పంపిణీ చేశారా? లేదా దానికి హాజరైన వారే డ్రింక్స్ తెచ్చుకున్నారా? తనకు తెలియదని ఆయన చెప్పారు. 'మా పార్టీ లేదా జేడీఎస్‌‌‌‌ కార్యకర్తలు ఇలా చేసి ఉంటే అది తప్పు. నా 25 ఏండ్ల రాజకీయాల్లో ఎన్నికల సమయంలో గానీ, ఏ కార్యక్రమంలో గానీ మద్యం పంపిణీ చేయలేదు.