ఢిల్లీలో ఆ మూడు రోజులు లిక్కర్ షాపులు బంద్

ఢిల్లీలో ఆ మూడు రోజులు లిక్కర్ షాపులు బంద్

ఢిల్లీ ప్రభుత్వం తన కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. సంవత్సరంలో లిక్కర్ షాపుల మూసివేత రోజుల సంఖ్యను 3 రోజులకు తగ్గించింది. ఇది గతేడాది 21 రోజులుగా ఉండేది. గణతంత్ర దినోత్సవం (జనవరి 26), స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి అక్టోబర్ 2 న లైసెన్స్ పొందిన మద్యం దుకాణాలు, నల్లమందు షాపులు మూసివేయబడతాయని ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్, 2010లోని రూల్ 52లోని నిబంధనలను అనుసరించి, ఎక్సైజ్ శాఖ, నల్లమందు  అమ్మకం దారుల  లైసెన్సులందరూ ఢిల్లీలోని జాతీయ రాజధాని భూభాగంలో ఈ క్రింది తేదీలను "నిషేధిత"గా పాటించాలని ఆదేశించింది. రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతిని లిక్కర్  అమ్మకాలు అనుమతించబడని రోజులుగా లిస్టు రెడీ చేసింది.

ఎల్-15 లైసెన్స్ ఉన్న హోటళ్ల విషయంలో డ్రై డేస్‌లో మద్యం అమ్మకాలపై ఉన్న పరిమితి నివాసితులకు మద్యం సేవకు వర్తించదని ఉత్తర్వుల్లో తెలిపింది. ఇంతకు ముందు, గొప్ప నాయకుల జన్మదినోత్సవం, మతపరమైన పండుగలతో సహా 21 డ్రై డేలు ఉన్నాయి. డ్రై డే రోజున లైసెన్స్‌దారు వ్యాపారాలు మూసివేయబడతాయి. మూడు డ్రైడేలు కాకుండా, ఇయర్ లో  ఏ రోజునైనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు 'డ్రై డే'గా ప్రకటించవచ్చని ఉత్తర్వుల్లో చెప్పింది. 'డ్రై డేస్' సంఖ్యకు సంబంధించిన ఏవైనా మార్పుల కారణంగా లైసెన్సుదారులు ఎటువంటి పరిహారం పొందలేరంది.

 

మరిన్ని వార్తల కోసం..

ఉచిత హామీల బడ్జెట్టే ఎక్కువైపోతోంది