డిసెంబర్ 8 నుంచి  పోలీస్ ఈవెంట్స్

డిసెంబర్ 8 నుంచి  పోలీస్ ఈవెంట్స్
  • డిసెంబర్ 8 నుంచి  పోలీస్ ఈవెంట్స్
  • రేపటి నుంచి డిసెంబర్ 3 వరకు అడ్మిట్ కార్డులు
  • 11 జిల్లాల్లో ఈవెంట్స్.. జనవరి మొదటి వారానికి పూర్తి

హైదరాబాద్‌‌, వెలుగు:  పోలీస్ ఈవెంట్స్‌‌ కోసం తెలంగాణ స్టేట్‌‌ లెవల్‌‌ పోలీస్ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు(టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌‌‌బీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిజికల్ మెజర్​మెంట్‌‌ టెస్ట్‌‌, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌‌లను నిర్వహిస్తామని టీఎస్‌‌ఎల్‌‌పీఆర్​బీ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాస్‌‌ రావు ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిపార్ట్​మెంట్​లోని వివిధ విభాగాల్లో15,644, ట్రాన్స్‌‌పోర్టు 63, ఎక్సైజ్‌‌లో 614 కానిస్టేబుల్‌‌ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామ్​ నిర్వహించారు. 

ఇందులో క్వాలిఫై అయిన 5,07,879 మంది అభ్యర్థుల నుంచి 4,63,970 అప్లికేషన్లు వచ్చాయి. అభ్యర్థులు అప్ లోడ్ చేసిన అప్లికేషన్లను బోర్డు స్క్రూటినీ చేసింది. అర్హులైన క్యాండిడేట్లకు డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8వ తేదీ నుంచి ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించనుంది. పార్ట్‌‌‌‌‌‌‌‌–2 అప్లికేషన్స్‌‌‌‌‌‌‌‌ సమగ్రంగా అప్లై చేసిన వారికి మంగళవారం (ఈ నెల 29) ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అడ్మిట్‌‌‌‌‌‌‌‌ కార్డులను ఇష్యూ చేయనుంది. అభ్యర్థులు టీఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ నుంచి అడ్మిట్‌‌‌‌‌‌‌‌ కార్డులు డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి. ఈవెంట్స్ కోసం 11 జిల్లాల్లోని పోలీస్ గ్రౌండ్స్​ను రెడీ చేశారు. అడ్మిట్ కార్డుల్లో క్యాండిడేట్లకు కేటాయించిన జిల్లాతోపాటు సెంటర్ వివరాలను పొందుపరిచారు. 

ఈవెంట్స్ ను జనవరి మొదటి వారంలోపు పూర్తి చేయనున్నారు. మెన్స్​కు1,600 మీటర్లు, విమెన్ క్యాండిడేట్లకు 800 మీటర్ల రన్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారి హైట్​ చూస్తారు. ఆ తర్వాత లాంగ్‌‌‌‌‌‌‌‌జంప్‌‌‌‌‌‌‌‌, షార్ట్‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తారు. పూర్తిగా డిజిటల్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌తో ఈవెంట్స్ నిర్వహిస్తారు. ప్రతి అభ్యర్థికి బయోమెట్రిక్ తర్వాత చేతికి డిజిటల్ ఆర్ఎఫ్ ఐడీ బ్యాండ్స్ అటాచ్ చేస్తారు. నిర్దేశించిన ఎత్తు కంటే ఒక్క సెంటీమీటర్ తక్కువ వచ్చిన వారికే రీ మెజర్ మెంట్ అవకాశం కల్పిస్తారు.