ఇవాళ ఓటు నమోదుకు ఆఖరు రోజు

ఇవాళ ఓటు నమోదుకు ఆఖరు రోజు

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ. ఓటు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఆన్‌లైన్ లేదా మీ సేవలో తమ ఓటును దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి సమాచారాన్నయినా  తెలుసుకోవాలనుకుంటే టోల్‌ఫ్రీ నెంబర్ 1950ను సంప్రదించొచ్చు. ceotelangana.nic.in, https://www.nvsp.in/Forms/Forms/form6  వెబ్‌సైట్‌లో ఓటు నమోదు చేసుకోవచ్చు. ఓటు నమోదు చేసుకునే సమయంలో ఏదేని గుర్తింపు సర్టిఫికెట్, అడ్రస్ పేపర్, కలర్‌ఫోటో తప్పనిసరి.

ఓటర్ల సమస్త సమాచారం తెలుసుకునేలా ప్రత్యేకంగా హెల్స్ లైన్ యాప్ అందుబాటులోకి తెచ్చారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి స్మార్ట్ ఫోన్ లోకి హెల్ప్ లైన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యాప్ లో పైన టూల్ బార్లో కనిపించే బాక్సులో ఓటరు కార్డు నంబర్ టైప్ చేయాలి. దీంతో ఓటరు వివరాలన్నీ పూర్తిగా వస్తాయి. ఏవైనా ఫిర్యాదులు ఉంటే హెల్ప్ లైన్ యాప్ లో కూడా చేయవచ్చు. ఎన్నికల సంఘం యాప్ ద్వారా కూడా ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. నా ఓటు యాప్ ద్వారా కూడా పేర్లు సరిచూసుకోవచ్చు.

మీ సేవ కేంద్రాల్లో తీసుకున్న కార్డు ద్వారా కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఆన్ లైన్ లో ఓటరు స్లిప్పులు తీసుకున్న వారు.. ఏదైనా గుర్తింపు కార్డుతో ఓటు వేయొచ్చు.