
అలీ బాబా నటుడు అభిషేక్ నిగమ్ ఆసుపత్రి పాలయ్యాడు. తన సోదరుడు సిద్ధార్థ్ నిగమ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్లో తెలిపాడు. తన సోదరుడు ఆస్పత్రిలో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి అతని ఆరోగ్యం కోసం ప్రార్థించమని అభిమానులను కోరాడు.
అభిషేక్ అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని..తనకు మలేరియానో, డెంగ్యూనో కాదని.. చిన్న వైరల్ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని సిద్ధార్థ్ నిగమ్ తెలిపాడు. అభిషేక్ త్వరలో కోలుకుంటాడని చెప్పాడు. వైరల్ ఇన్ ఫెక్షన్లు ప్రతి చోటా ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు. అభిషేక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ అభిమానులను కోరాడు. అభిషేక్ కూడా ఇవాళ ఉదయం తన ఇన్ స్టాగ్రమ్ లో ఓ ఫోటోను షేర్ చేశాడు. తాను క్షేమంగా ఉన్నానని ఇవాళ నిజంగా తనకు శుభోదయం అని పోస్ట్ చేశాడు అభిషేక్.