బేబీతో ఇంటికి చేరుకున్న అలియా భట్

బేబీతో ఇంటికి చేరుకున్న అలియా భట్

గత ఆదివారం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అలియా భట్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రణబీర్ కపూర్, అలియా భట్ తమ బిడ్డను ఇంటికి తీసుకువెళ్లారు. అలియా భట్, రణబీర్ కపూర్‭తో కలిసి ఆస్పత్రి నుంచి వెళుతున్న ఫోటోలు బయటికి వచ్చాయి. రణబీర్ తల్లి నీతూ కపూర్ కూడా వారి వెంట ఉన్నారు. 

అలియా, రణబీర్‭లు తమ ఇంటికి ఆడపిల్ల వచ్చిందంటూ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. తమ జీవితంలో ఇది మరుమరాని విషయం అంటూ వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక తమ ఇంటికి ఆడపిల్ల వచ్చిన సందర్భంగా రణబీర్ తల్లిదండ్రులు సంబరాలు జరిపారు. ఇంటి వద్ద అలియా భట్‭కు ఘన స్వాగతం పలికారు.