
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ అవడానికి కారణమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఇటలీలోని మిలాన్‌లో జరిగిన గూచీ స్ప్రింగ్ సమ్మర్ 2026 ఫ్యాషన్ షోకు అలియా భట్ హాజరైంది.
గూచీ గ్లోబల్ అంబాసిడర్‌గా ఈ షోకు వెళ్లిన ఆమె.. తన కొత్త చిత్రం ‘ఆల్ఫా’ గురించి మాట్లాడింది. తన కెరీర్‌లోని ఫస్ట్ యాక్షన్ సినిమా ఇదని, ఇందులో నటించడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, అదే సందర్భంంలో కొంత భయంగానూ ఉందని ఆమె చెప్పింది. అయితే కామెంట్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే ఆమె రాజీ, జిగ్రా చిత్రాలతో పాటు ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ సినిమాలోనూ యాక్షన్ సీన్స్‌లో నటించిందని, అలాంటప్పుడు ‘ఆల్ఫా’ తన ఫస్ట్ యాక్షన్ మూవీ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇన్ సెక్యూరిటీతోనే అలియా తన ప్లాప్ సినిమాలైన హార్ట్ ఆఫ్ ది స్టోన్, జిగ్రా చిత్రాలను యాక్షన్ సినిమాలుగా భావించడం లేదని కామెంట్ చేస్తున్నారు.
ఈ విషయంలో ఆమె భర్త చాలా బెటర్ అని, తన కెరీర్ స్టార్టింగ్‌లోని యాక్షన్ సినిమాలపై ఇప్పటికీ తాను జోక్ చేస్తుంటాడని రణబీర్ కపూర్ పేరును కూడా ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు ఈ ఈవెంట్‌కు సంబంధించిన అలియా ఫొటోస్, వీడియోస్ కూడా ట్రోల్ అయ్యాయి. ఇందులో ఆమె టెర్రిబుల్ మేకప్, హెయిర్ స్టైల్‌తో కనిపించిందని, పైగా తనకు ఏమాత్రం సూట్ అవని కాస్ట్యూమ్స్‌లో, ఆమె ఓ మంత్రగత్తెలా కనిపించిందని కూడా ట్రోల్ చేస్తున్నారు.