నిర్మాతగా మారిన ఆలియా భట్

నిర్మాతగా మారిన ఆలియా భట్

యునిక్ సబ్జెక్ట్స్‌‌‌‌ని ఎంచుకుంటూ, తన నటనతో ఫిదా చేస్తున్న ఆలియా భట్, నిర్మాతగానూ మారింది. షారుఖ్‌‌‌‌తో కలిసి ‘డార్లింగ్స్’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. జస్మీత్ కె రీన్‌‌‌‌ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 5న నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌లో స్ట్రీమ్​ కానుంది. నిన్న ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఆలియా, తన తల్లి షెఫాలీ ముంబైలో నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తుంటారు. అంతలో తన జీవితంలోకి వినయ్ వర్మ వస్తాడు. అతని వల్ల ఆమె ఎంతో హింస అనుభవిస్తుంది. ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంటుంది. తల్లి, మరొక యువకుడితో కలిసి అతన్ని బంధించి, చిత్రహింసలు పెడుతుంది. తనపై డౌట్ రాకుండా భర్త మిస్సయ్యాడంటూ పోలీస్ కంప్లయింట్ కూడా ఇస్తుంది. ఎంక్వయిరీ మొదలుపెట్టడంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి తాను అనుకున్నది చేయగలుగుతుందా, పోలీసులకి దొరికిపోతుందా లేక తన భర్తకి గుణపాఠం నేర్పిస్తుందా అనేది మిగతా కథ. తల్లీకూతుళ్లిద్దరూ కాస్త డేంజరస్‌‌‌‌గానే కనిపిస్తున్నారు ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో. షెఫాలీ, ఆలియా ఇద్దరూ మంచి యాక్టర్లే కావడంతో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.