మార్చి 31 ఆదివారం రోజున బ్యాంకులు ఓపెన్

మార్చి 31 ఆదివారం రోజున బ్యాంకులు ఓపెన్

సాధారణంగా బ్యాంకులు  ప్రతి నెలలో అన్ని ఆదివారాలు... రెండో, నాలుగో శనివారాల్లో సెలవులు ఉంటాయి.  కానీ మార్చి 31వ తేదీ ఆదివారం రోజున అన్ని బ్యాంకులు  తమ శాఖలను తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంకు సూచించింది.  అయితే దీనికి కారణం లేకపోలేదు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగియనుండటంతో ప్రభుత్వ వ్యాపారాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుందన్న అంచనాతో ఈ సూచన చేసింది.  

ప్రభుత్వానికి చెందిన ఆర్థిక లావాదేవీలు, చెల్లింపులు అధికంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 31న అన్ని బ్యాంకుల శాఖలు తెరిచివుంచాలని సూచించింది. ఆర్‌బీఐ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆదివారం యథావిధిగా పనిచేయనున్నాయి. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా, ఆదాయపు పన్ను శాఖ తన అన్ని కార్యాలయాలకు సుదీర్ఘ వారాంతపు సెలవులను కూడా రద్దు చేసింది.

ఏజెన్సీ బ్యాంకుల జాబితా

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
కెనరా బ్యాంక్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇండియన్ బ్యాంక్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
UCO బ్యాంక్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు

యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్.
సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్.
DCB బ్యాంక్ లిమిటెడ్
ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్.
HDFC బ్యాంక్ లిమిటెడ్.
ICICI బ్యాంక్ లిమిటెడ్.
IDBI బ్యాంక్ లిమిటెడ్.
IDFC FIRST బ్యాంక్ లిమిటెడ్
ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్ 
కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్
కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్
కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్.
RBL బ్యాంక్ లిమిటెడ్
సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్.
యస్ బ్యాంక్ లిమిటెడ్.
ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్
బంధన్ బ్యాంక్ లిమిటెడ్
CSB బ్యాంక్ లిమిటెడ్.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్