
రాష్ట్రంలో కరోనా నివారణలో భాగంగా ఏప్రిల్-30వ తేదీ వరకు సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో జరగాల్సిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఎంసెట్ తో పాటు మే నెలలో జరగాల్సిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది ఉన్నత విద్యా మండలి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉన్నత విద్యా మండలి ఛైర్మైన్ పాపిరెడ్డి..ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించిన దరఖాస్తుల గడువును మే-5 వరకు పెంచామని తెలిపారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పై ప్రభుత్వంతో చర్చించి కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పారు పాపిరెడ్డి.