మే 3 వరకూ ఫ్లైట్లన్నీ బంద్

మే 3 వరకూ ఫ్లైట్లన్నీ బంద్

న్యూఢిల్లీ: అన్ని పాసింజర్​ ఫ్లైట్లను మే 3వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించారు. దేశంలో లాక్​డౌన్​ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మే 3 రాత్రి 11.59 నిమిషాల వరకూ అన్ని డొమెస్టిక్, ఇంటర్నేషనల్​ ఫ్లైట్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్టు సివిల్​ ఏవియేషన్​ మినిస్ట్రీ స్పష్టం చేసింది. మే 3 తర్వాత డొమెస్టిక్, ఇంటర్నేషనల్​ ఫ్లైట్ల రాకపోకలపై ఆంక్షలను ఎత్తేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆ శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​పూరి ట్విట్టర్​లో పేర్కొన్నారు. మంచి కారణంతో లాక్​డౌన్​ను పొడిగించారని, ఆ తర్వాతే ఆంక్షలను ఎత్తేయడంపై ఆలోచిస్తామని, ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారు అప్పటివరకూ ఓపిక పట్టాలని ఆయన కోరారు. లాక్​డౌన్​ కారణంగా ఏవియేషన్​ సెక్టార్​పై తీవ్రమైన ప్రభావం పడింది. రెవెన్యూ లేకపోవడంతో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు శాలరీలు తగ్గించగా.. మరికొన్ని కంపెనీలు కొందరిని జాబ్​ నుంచి తొలగించాయి.