దొంగలే మోసపోయారు : కష్టపడి ఏటీఎం పగలగొడితే రూపాయి కూడా లేదు

దొంగలే మోసపోయారు : కష్టపడి ఏటీఎం పగలగొడితే రూపాయి కూడా లేదు

బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు దోచుకుని అంతాఇంతో వెనకేసుకుందామనుకున్న దొంగలకు ఊహించని పరిణామం ఎదురైంది.  కష్టపడి  ఏటీఎం పగలగొడితే అందులో ఒక్కరూపాయి కూడా లేదు. దీంతో మోసపోవడం దొంగల పనైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ సమీపంలో 2023 ఆగస్టు 19 శనివారం రోజున  తెల్లవారుజామున చోటుచేసుకుంది.   

కొందరు దొంగలు నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బు కోసమని చొరబడ్డారు. ఏటీఎం పగలగొట్టడమే కాకుండా సీసీటీవీ కెమెరాను కూడా ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ ఏటీఎం మరమ్మతు పనులు  ప్రస్తుతం జరుగుతున్నందున అందులో డబ్బు నిల్వ లేదని పోలీసులు తెలిపారు.  దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  

 ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని రెండు ఏటీఎంల నుంచి కొందరు గుర్తుతెలియని దొంగలు రూ.38 లక్షలకు పైగా దోచుకెళ్లారు. అజ్మీర్‌లోని అరయిన్ ప్రాంతంలోని ఏటీఎంలో రూ.8 లక్షలు, రూపన్‌గఢ్‌లోని మరో ఏటీఎంలో రూ.30 లక్షలు దోచుకెళ్లారు .  ఈ సంఘటనలు రెండు రోజుల వ్యవధిలో జరిగాయి.  దోపిడీ పద్ధతులు ఒకేలా ఉండడంతో ఈ రెండు నేరాలు ఒకే దొంగల ముఠా చేసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.