ఎన్నికల్లో బీసీలకు 52 సీట్లు ఇస్తం: ఏఐఎఫ్​బీ

ఎన్నికల్లో బీసీలకు 52 సీట్లు ఇస్తం: ఏఐఎఫ్​బీ

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరిగే ఎన్నికల్లో బీసీలకు 52 సీట్లను కేటాయిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్​బీ) ఎన్నికల కమిటీ చైర్మన్ కటకం మృత్యుంజయం తెలిపారు. రాష్ట్రాన్ని పదేండ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేయలేదని ఆరోపించారు. 

ఆదివారం హైదరాబాద్​లోని ఏఐఎఫ్​బీ ఆఫీసులో కాంగ్రెస్, బీఎస్​పీ నుంచి పలువురు నేతలు మృత్యుంజయం సమక్షంలో ఫార్వర్డ్ బ్లాక్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల్లో 31 రిజర్వుడ్ సీట్లని, మిగిలిన 88 సీట్లలో 60శాతానికి పైగా స్థానాలను బీసీలకే ఇస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాదని, సంకీర్ణ సర్కారు ఏర్పాటయ్యే అవకాశముందని తెలిపారు. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన భాగస్వామిగా మారబోతోందన్నారు.