రాజీనామాకు కర్నాటక కాంగ్రెస్ మంత్రుల నిర్ణయం

రాజీనామాకు కర్నాటక కాంగ్రెస్ మంత్రుల నిర్ణయం

కర్నాటక సంకీర్ణ సర్కార్ లోని కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. తమ పదవులకు రిజైన్ చేసి.. ఆ పదవుల్ని పార్టీ రెబల్స్ కు ఇచ్చే అవకాశాలున్నాయి.  ఉదయం డిప్యూటీ సీఎం పరమేశ్వర…పార్టీ మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తు వ్యూహాలపై చర్చించారు. ఫైనల్ గా రెబల్స్ ని దారిలోకి తేవాలంటే..మంత్రి పదవుల పంపకమే ఫైనల్ అని తేల్చినట్టు తెలుస్తోంది. దీనికోసమే ప్రస్తుత మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, మంత్రి నగేష్.. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కర్నాటక రాజకీయ సంక్షోభం..గంటగంటకు ముదురుతోంది. చర్చలు, సమావేశాలు ఎన్ని జరిగినా..ఫలితం మాత్రం కనిపించడం లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యే రామలింగరెడ్డితో సీఎం కుమారస్వామి రహస్యంగా సమావేశమయ్యారు. సిద్ధరామయ్యను సీఎం చేయాలని రామలింగారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కాచుక్కూచుంది. గవర్నర్ ఆహ్వానిస్తే సర్కార్ ఏర్పాటుకు సిద్ధమంటోంది. ఇంకోవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదంపై ఉత్కంఠ కలుగుతోంది. రాజీనామాలపై స్పీకర్ త్వరగా తేలుస్తారా..పెండింగ్ లో పెడతారా..అనేదానిపై టెన్షన్ కొనసాగుతోంది.