రోడ్డు ప్రమాద మృతుల నుంచి.. అవయవదానానికి చర్యలు తీస్కోండి.. రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లెటర్

రోడ్డు ప్రమాద మృతుల నుంచి.. అవయవదానానికి చర్యలు తీస్కోండి.. రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లెటర్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది చనిపోతున్నారు కానీ వారి అవయవాలను, టిష్యూను సేకరించడంలో మాత్రం తగిన కార్యాచరణ ఉండటంలేదని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది.

 రోడ్డు ప్రమాద మృతుల నుంచి అవయవాలను సేకరించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ‘నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ (నోటో)’ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూటీలకు తాజాగా లేఖ రాశారు.