
న్యూఢిల్లీ: పార్లమెంట్ మాన్‌సూన్ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పకడ్బందీ సేఫ్టీ చర్యలతో సమావేశాలను ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలు అందరూ ఆర్‌టీ–పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. బిర్లా అధ్యక్షతన మాన్‌సూన్ సమావేశాలకు సంబంధించి సన్నాహక మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లోనే ఆర్‌టీ–పీసీఆర్ టెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌టీ–పీసీఆర్‌లో ఫలితం రావడానికి 24–48 గంటలు పడుతుంది. ఈ సమావేశాలకు హాజరయ్యే జర్నలిస్టులు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఈ మీటింగ్‌లో డెసిజన్ తీసుకున్నారు. ఈ సమావేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎయిమ్స్, డీఆర్‌డీవో అధికారులు పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్ 14న మొదలవనున్నాయి. అక్టోబర్ 1తో ఈ సెషన్స్ ముగియనున్నాయి.