అన్ని బ్యాంక్‌‌లకు ఒకే టైమింగ్స్​

అన్ని బ్యాంక్‌‌లకు ఒకే టైమింగ్స్​

హైదరాబాద్, వెలుగుప్రభుత్వ రంగ బ్యాంక్‌‌లన్నింటికీ ఒకే పనివేళలు అమల్లోకి రాబోతున్నాయి.  దేశవ్యాప్తంగా ఒకేవిధమైన బ్యాంకింగ్ అవర్స్‌‌ను ఖరారు చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌ల సీఈవోలు, ఎండీలతో, ఐబీఏ సబ్‌‌కమిటీతో ఫైనాన్సియల్ సర్వీసెస్‌‌ డిపార్ట్‌‌మెంట్ చర్చలు జరిపింది. కస్టమర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. ప్యాన్ ఇండియా బేసిస్‌‌లో కస్టమర్ బ్యాంకింగ్ అవర్స్‌‌లో మూడు టైమ్ సెట్స్‌‌ను, ఐబీఐ సబ్‌‌కమిటీ ప్రతిపాదించింది. డీసీసీ, ఎస్‌‌ఎల్‌‌బీసీ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ప్రభుత్వ బ్యాంక్‌‌లన్నీ ఒకేవిధమైన బ్యాంకింగ్ అవర్స్‌‌ను పాటించాలని ఐబీఏ సూచించింది.

రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు యునిఫామ్ బ్యాంకింగ్ అవర్స్‌‌ను అమలు చేసేందుకు డీసీసీ,ఎస్ఎల్‌‌బీసీ నుంచి అనుమతి వచ్చినట్టు ఎస్‌‌బీఐ జనరల్ మేనేజర్, ఎస్‌‌ఎల్‌‌బీసీ కన్వినర్ యూఎన్‌‌ఎన్‌‌ మైయా చెప్పారు. ఇన్ని రోజులు ఒక్కో బ్యాంక్‌‌ ఒక్కో పని గంటలను అమలు చేస్తుండటంతో, కస్టమర్లు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ కారణంతో కస్టమర్ల సౌకర్యార్థం ప్రభుత్వం ఒకే పనివేళలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.