తొలిరోజే పుస్తకాల పంపిణీ

తొలిరోజే పుస్తకాల పంపిణీ
  • జిల్లాలకు 30 లక్షల పుస్తకాలు

రాష్ట్రం లో బడులు ప్రారంభమయ్యే రోజునే ( జూన్​1న) ప్రభుత్వ, ఎయిడెడ్​, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. మే నెలాఖరు నాటికి అన్ని స్కూళ్లకు పుస్తకాలు చేరేలా చర్యల తీసుకుంటున్నారు. ఇప్పటికే 30 లక్షలకు పైగా పుస్తకా లు జిల్లాలకు పంపినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఒకటి నుంచి టెన్త్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలోని 52 లక్షల మందికి పైగా ఉన్నవిద్యార్థులకు  కోట్లకు పైగా పుస్తకా లు కావల్సి ఉందని..ప్రింటింగ్‌ బాధ్యతలు 40 సంస్థలకు అప్పగించామని తెలిపారు. ముడిసరుకు రేటు పెరగడంతో ఈ ఏడాది నుం చి పుస్తకా ల ధరలు 20 శాతం వరకు పెరగొచ్చన్నారు.