బీసీ గురుకులాల్లోసీట్లన్నీ ఫుల్

బీసీ గురుకులాల్లోసీట్లన్నీ ఫుల్
  • ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు సీట్లన్నీ భర్తీ

హైదరాబాద్ , వెలుగు: బీసీ గురుకులాల్లో ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ప్రతి ఏటా సెప్టెంబర్ వరకు జరిగే అడ్మిషన్ల పక్రియ తొలిసారిగా జులైలోనే ముగిసిందని అధికారులు చెబుతున్నారు. అడ్మిషన్లు పూర్తి అయ్యాయని, సీట్లు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే  మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు సూచించారు. ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు సీట్లు ఫుల్ అయ్యాయని మసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లోని బీసీ గురుకుల సొసైటీ కార్యాలయం దగ్గర అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు.

 అయినప్పటికీ, నిత్యం వందలాది మంది స్టూడెంట్స్, తల్లిదండ్రులతో కలిసి సీట్లు ఇవ్వాలని సంక్షేమ భవన్ కు వస్తున్నారు.  బీసీ గురుకులాల్లో పదో తరగతి వరకు 1,39,440 సీట్లు ఉండగా, ఇంటర్ లో 44,800 సీట్లు ఉన్నాయని.. ఇవన్నీ భర్త అయ్యాయని సెక్రటరీ తెలిపారు. గత ఏడాది ఇంటర్ లో చాలా సీట్లు ఖాళీ ఉండగా ఈ ఏడాది మొత్తం ఫిల్ అయ్యాయని చెప్పారు.