బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలానికి సర్వం సిద్ధం

బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలానికి సర్వం సిద్ధం

ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే  బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలానికి సర్వం సిద్ధమైంది. ఈసారి బాలాపూర్ లడ్డూ ఎవరికి దక్కనుందోనని సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. లక్షలు పెట్టి లడ్డూను దక్కించుకున్న వారికి అంతా మంచి జరుగుతుందనే నమ్మకంతో రాజకీయ నేతలేగాక బడా వ్యాపారులు సైతం వేలంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇన్ని లక్షలు పెట్టి లడ్డూను దక్కించుకున్న వారికి అంతా మంచిజరుగుతుందనే నమ్మకం ఉంది. తొలుత భక్తిగా.. తర్వాత సెంటిమెంట్ గా మొదలైన వేలంపాట తర్వాత ప్రెస్టీజ్ ఇష్యూగా మారిపోయింది. బాలాపూర్ లడ్డును దక్కించుకునేందుకు  స్థానికులేకాదు ఇతర ప్రాంతాల వాసులు సైతం వేలంలో పాల్గొననున్నారు.

అటు 43 ఏళ్ల చరిత్ర ఉన్న బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం 1994 నుంచి కొనసాగుతూ వస్తోంది. తొలి ఏడాది బాలాపూర్ కు చెందిన కొలను మోహన్ రెడ్డి450 రూపాయలకు వేలం ద్వారా లడ్డూను దక్కించుకున్నారు. తర్వాత సంవత్సరంలోనూ4 వేల 500 లకు మళ్లీ ఆయనే అందుకున్నారు. 2002లో తొలిసారి వేలం పాట లక్ష దాటింది. కందాడ మాధవరెడ్డి లక్షా 5 వేలకు లడ్డూను అందుకున్నారు. 2013లో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి 9 లక్షల 26 వేలకు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి తొమ్మిదిన్నర లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు. అటు 2022 ఏడాది లడ్డూవేలంలో వంగేటి లక్షారెడ్డి 24 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు.