బీజేపీతో కేటీఆర్ కుమ్మక్కు : ఎమ్మెల్యే నాగరాజు

బీజేపీతో కేటీఆర్ కుమ్మక్కు : ఎమ్మెల్యే నాగరాజు
  • అందుకే యూరియా ఇచ్చిన వాళ్లకే మద్దతు అంటున్నడు: వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు 

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ రాజకీయ అజ్ఞాని అని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఫైర్ అయ్యారు. బీజేపీతో కుమ్మక్కై.. యూరి యా ఇచ్చిన వాళ్లకే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్తున్నాడని, ఇది తెలంగాణ ప్రజల్ని మోసగించే ప్రయత్నమేనని  విమర్శించారు. గురువారం గాంధీ భవన్ లో ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొన్నారు. 

పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించి.. ఫోన్​లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వాటి పరిష్కా రానికి చర్యలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తే.. కేటీఆర్ మాటలు ఆయన  అహంకారాన్ని తెలియజేస్తున్నాయని ధ్వజమెత్తారు.