
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్‌కు APPSC అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు పావుగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు కమిషన్ కార్యదర్శి ఇప్పటికే స్పష్టం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షకు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,95,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను కమిషన్ ఏర్పాటు చేసింది.