
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ఓటీటీ సిరీస్ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది.
ఈ సిరీస్‌లో కిల్ మూవీ హీరో లక్ష్య, సహేర్ బంబా, బాబీ డియోల్, మనోజ్ పహ్వా, రజత్ బేడి, గౌతమి కపూర్, మనీష్ చౌదరి కీలక పాత్రల్లో నటించారు. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, రణ్‌వీర్ సింగ్, రాజమౌళి వంటి దిగ్గజాలు గెస్ట్ రోల్ ప్లే చేశారు.
Ab jo bolega… yeh show bolega 🔥
— Netflix India (@NetflixIndia) September 18, 2025
Watch The Ba***ds of Bollywood, out now, only on Netflix. #TheBadsOfBollywoodOnNetflix pic.twitter.com/KV5QvCDFua
కథేంటంటే:
ఆస్మాన్ సింగ్ (లక్ష్య లాల్వాని) బాలీవుడ్ ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తి. ఎలాగైనా సినిమాలో హీరోగా నటించి సక్సెస్ సాధించాలని పట్టుదలతో కష్టపడుతుంటాడు. చివరకు తన తొలి సినిమా ‘రివాల్వర్’ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది. దాంతో బాలీవుడ్‌లోని పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు ముంచెత్తుతాయి. కానీ, అనుభవం లేకపోవడంతో అతను ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం అతడి జీవితంలో ఎలాంటి కష్టాలను తీసుకొచ్చింది? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే:
ఈ సిరీస్ బాలీవుడ్ ఇండస్ట్రీపై సెటైరికల్ సిరీస్గా తెరకెక్కింది. మొత్తం ఏడు ఎపిసోడ్లు, ఒక్కొక్కటి నలభై అయిదు నుంచి యాభై నిమిషాల నిడివితో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మెప్పించే కామెడీ, అబ్బురపరిచే క్యామియో రోల్స్, విజిల్స్ వేయించే డైలాగ్స్ తదితర అంశాలు ఈ సిరీస్‌కు కలిసొచ్చాయి.
డైరెక్టర్గా ఆర్యన్ ఖాన్ తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. ఒక కొత్త దర్శకుడు ఈ కథను తెరకెక్కించాడనే భావన కలగకుండా అన్నీ విషయాల్లో చాలా జాగ్రత్త పడ్డాడు. బాలీవుడ్ గురించి తెలిసిన వారికి ఈ సిరీస్ ఇట్టే అర్థమవుతుంది. బాలీవుడ్‌ను ఫాలో కాని వారికి వెండితెర వెనకాల ఏం జరుగుతుందో తెలిపే సిరీస్‌గా ఇది కళ్లకు కట్టినట్లుగా చూపించింది.