
వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్తో త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ‘వెంకటరమణ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ క్రమంలో వెంకీకి జోడీగా ఎవరు నటిస్తున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. మన వెంకటరమణకు జోడీగా ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇపుడు ఇంట్రెస్టింగ్గా మరో నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో త్రిష, రుక్మిణీ వసంత్, మీనాక్షి చౌదరి, సంయుక్త మీనన్ ఇలా కొంత మంది బ్యూటీల పేర్లు బయటకొచ్చాయి. అయితే, వీరిలో ఫైనల్గా శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. గురూజీ రాసిన పాత్రకు శ్రీనిధి అయితేనే పర్పెక్ట్ జోడీ అని టీమ్ మొత్తం భావిస్తున్నారట.
ఇప్పటికే కథను వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. గ్లామర్ షోస్ చేయకుండా పద్దతిగా నటించే రమణమ్మను రమణతో జత కడుతున్నారంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
‘కేజీఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. నానికి జంటగా ‘హిట్ 3’లో నటించి టాలీవుడ్‌లోనూ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో నటించిన తెలుసు కదా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అక్టోబర్ 17న దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. దీంతోపాటు పలు తమిళ, కన్నడ ప్రాజెక్టులు శ్రీనిధి లైనప్‌లో ఉన్నాయి.
Just.⏳️🌠🤍 pic.twitter.com/n6plvRfPqY
— Srinidhi Shetty (@SrinidhiShetty7) May 23, 2025
వెంకటేష్ హీరోగా నటిస్తున్న 77వ సినిమా కాగా, చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునేలా త్రివిక్రమ్ తనదైన శైలిలో కథారచనా చేసినట్లు టాక్. అక్టోబర్లో మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇకపోతే, ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు.
#VenkateshXTrivikram
— Venkatesh Daggubati (@VenkyMama) August 15, 2025
This one is special ❤️#Trivikram #SRadhaKrishna (Chinababu) garu @vamsi84 @haarikahassine #Venky77 pic.twitter.com/CDWYUypmes