.మెదక్ టౌన్, వెలుగు : మెదక్ చర్చి ఆవరణలోని సమాధుల వద్ద ఆదివారం ఆల్ సోల్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని క్రిస్టియన్లు వారి కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు వెళ్లి పూలు, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.
మెదక్ ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 2న మృతుల ఆత్మశాంతి కోసం ఆల్ సోల్స్ డేను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు
