ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: CEO రజత్ కుమార్

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: CEO రజత్ కుమార్

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(CEO) రజత్‌కుమార్. 11వ తేదీ గురువారం ఎన్నికలు నిర్వహించనున్నందున ఇవాళ(మంగళవారం) సాయంత్రం 5 గంటలకల్లా రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముగించాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల 604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు CEO రజత్ కుమార్. 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఎన్నికలు ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ షాపులు కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.  నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 4 వరకే పోలింగ్ ఉంటుందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కు మాత్రం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.  ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. దివ్యాంగుల కోసం ఈసారి కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2.97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు రజత్ కుమార్. వీరిలో వీళ్లలో 1.49 కోట్ల మంది పురుషులు, 1.47 కోట్ల మంది స్త్రీ ఓటర్లు ఉన్నారన్నారు. ఇక థర్డ్ జెండర్స్ 1,504 మంది, సర్వీస్ ఓటర్లు 11,320, NRI ఓటర్లు 1731 ఉన్నారని తెలిపారు.

ఎన్నికల్లో మొత్తం 79 వేల 882 EVM లు, 42 వేల 853 కంట్రోల్ యూనిట్స్,46 వేల 731 వీవీప్యాట్ లు ఈసారి ఎన్నికల కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 2.80 లక్షల పైగా సిబ్బంది ఈ ఎన్నికల్లో విధులు నిర్వర్తించనున్నారు.

17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మొత్తంగా 443 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో అత్యధికంగా నిజామాబాద్ పార్లమెంట్ కు 185 మంది అభ్యర్థులు, అత్యల్పంగా మెదక్ పార్లమెంట్ కు 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బెల్ ఎం 3 EVM లను వినియోగించనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేయనున్నారు. టెక్నికల్ సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు బెల్, ఈసీఐఎల్ నుంచి 650  మంది ఇంజనీర్లను నిజామాబాద్ లో ఆన్ డ్యూటీ లో ఉండనున్నారు.

ఓటర్లకు కోసం, వాళ్ళ సమాచారం కోసం ఈసీఐ నా ఓటు యాప్ ను అందుబాటులో ఉంచింది. ఎన్నికల కోసం ఇప్పటికే ఫొటో ఓటర్ స్లిప్ ల పంపిణీ ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయింది.

పోలింగ్ రోజున అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వాలని…లేదంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు CEO రజత్ కుమార్.  మే 23 న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.