
- భద్రతా లోపాలు కనుగొనడమే లక్ష్యం
- ఎథికల్ హ్యాకర్లు లోపాలునివేదించాలన్న సంస్థ
- క్వాలిటీ విషయంలో సీరియస్గా వ్యవహరిస్తున్న కంపెనీ
తిరుపతి/హైదరాబాద్: భద్రత విషయంలో అగ్రస్థానం లో ఉన్న ఆపిల్ కంపెనీ తన ఉత్ప త్తుల క్వాలిటీ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకునేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్, ఐ ప్యాడ్, మ్యాక్ బుక్ ల్యాప్ టాప్స్ సహా తమ కంపెనీ తయారు చేసే అన్ని ఉత్ప త్తులను హ్యాక్ చేయగలిగితే కోట్ల రూపాయలు బౌంటీ రివార్డ్స్ ఇస్తా మని బహిరంగ ప్రకటన చేసింది.
ఈ కార్యక్రమం ద్వారా ఎథికల్ హ్యాకర్లు ఆపిల్ ఉత్పత్తులలో ఉన్న లోపాలను కనుగొని, తమకు నివేదించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ లోపాలను కనుగొన్న వారికి ఆపిల్ భారీ నగదు బహుమతులను అందిస్తుంది. ఈ బహుమతులు కనీసం రూ. 4 లక్షల నుంచి 17.5 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. ఐదు విభాగాలుగా బహుమతులను విభజించింది. విభాగాల ఆధారంగా బహుమతి మారుతుంది.
ఫిజికల్ యాక్సెస్
హ్యాకర్ ఐఫోన్ ను ఫిజికల్ గా పట్టుకొని దానిలోని లోపాలను ఉపయోగించుకోవాలి. ఉదాహరణ కు లాక్ స్క్రీన్ ను బైపాస్ చేస్తే రూ.83 లక్షల వరకు లభిస్తుంది. లాక్ చేసిన ఫోన్ నుంచి యూజర్ డేటాను తీసుకుంటే రూ.2 కోట్లు బహు మతిగా ఇస్తామని తెలిపింది.
ఇన్స్టాల్ చేసిన యాప్ ద్వారా
యూజర్ ఇన్స్టాల్ చేసిన యాప్స్ ద్వారా లోపాలను ఉపయోగించుకోవాలి. ఈ రకమైన హ్యాకింగ్ కు రూ. 4 లక్షల నుంచి 1.25 కోట్ల వరకు బహుమతులు ఇవ్వనున్నట్టు తెలిపింది.
యూజర్ ఇంటరాక్షన్ నెట్వర్క్ పై
యూజర్ ఇంటరాక్షన్ ద్వారా అనధికార యాక్సెస్ లేదా ప్రివిలేజ్ ఎలివేషన్ జరుగుతుంది. ఒక క్లిక్ తో డేటా యాక్సెస్, అథెంటిసిటీ పొందితే రూ. 2,18,90,137 వరకు బహుమతి లభిస్తుంది.
ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ డేటాపై
ఆపిల్ ప్రైవేట్ క్లౌడ్ లో డేటాను టార్గెట్ చేస్తే సుమారు ₹1.25 కోట్లు లభిస్తుంది. రిమోట్ గా దాడి చేసి లాక్ డౌన్ మోడ్ ను బైపాస్ చేస్తే ₹17.5 కోట్లు బహుమతి పొందవచ్చు.
యూజర్ ఇంటరాక్షన్ లేని నెట్ వర్క్
యూజర్ ఇంటరాక్షన్ లేని నెట్ వర్క్ దాడులను "జీరోక్లిక్” అటాక్స్ గా పిలుస్తారు. ఉదాహరణకు, ఆపిల్ కెర్నల్ పీఏసీ ప్రొటెక్షన్ ను బైపాస్ చేస్తే 8.3 కోట్ల రూపాయల బహుమతి పొందవచ్చు.