అందరి చూపు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సీటు పైనే

అందరి చూపు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సీటు పైనే

నల్గొండ లోక్ సభ సెగ్మెంట్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందటంతో అందరి దృష్టి హుజుర్ నగర్ వైపు మళ్లింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ ఎమ్మెల్యేగా గెలిచారు.తాజాగా ఎంపీగా విజయం సాధించడంతో హుజుర్ నగర్ సీటు ఖాళీ అయింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఆరు నెలల వ్యవధిలో అక్కడ తిరిగి ఎన్నిక నిర్వహించాలి. అందుకే ప్రధాన పార్టీలన్నీ అటువైపు ఓ కన్నేసి ఉంచాయి. ఈ నేపథ్యం లో అక్కడ ఎవరెవరు పోటీ చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. పీసీసీ చీఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ కావటంతో కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఇప్పటివరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి న ఉత్తమ్.. హుజూర్ నగర్ నుంచే మూడుసార్లు గెలుపొందారు. అందుకే సిట్టింగ్ సీటును ఎలాగైనా తన గుప్పిట్ లో నే ఉంచుకోవాలని ఆయన పట్టుదలతో ఉన్నా రు. ఆ దిశగా ఇప్పట్నుంచే పార్టీ కేడర్ ను అప్రమత్తం చేస్తున్నారు.

పెరిగిన మెజారిటీ..

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని ఉత్తమ్ పోటీకి దిం పుతారనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కోదాడ నుంచి గెలిచిన పద్మావతి.. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో పార్టీకి పట్టున్న హుజూర్ నగర్ నుంచి ఆమెను పోటీకి దింపుతారనే చర్చ మొదలైంది. ఆమెను కా దని ఇంకొకరికి టికెట్ ఇద్దామని పార్టీ డిసైడైనా, స్థానికంగా అంత ప్రజాదరణ ఉన్న నేతలు లేరు. హ్యా ట్రిక్ విజయాలతో ఉత్తమ్ ఇక్కడ తన పట్టు నిలుపుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు వేల ఆధిక్యం తో గెలిచి న ఉత్తమ్ కు.. లోక్ సభ ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్ లో 12,993 ఓట్ల మె జారిటీ రావటం గమనార్హం. ఉత్తమ్ అనుభవం, ఆయనకున్న పరిచయాలు, సడలని ఓటు బాంకు అక్కడ కలిసొస్తుందని పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నా యి.

టీఆర్ఎస్ కు టఫ్ ఫైట్‌…..‌

ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు పరీక్ష పెట్టనుంది. నల్గొండ ఎంపీ సీటు కోల్పోయిన పరాభావంలోఉన్న ఆ పార్టీ ఈ సీటును దక్కించుకునేందుకు శక్తియుక్తులన్నీ ఒడ్డనుంది. ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్ డి ఇప్పుడు కూడా రేసులో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నా రు. ప్రస్తుతం ఆయనే నియోజకవర్గ ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నా రు. 2009 నుంచి హుజూర్ నగర్ లో జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు చేదు ఫలితమే ఎదురైంది. మంత్రి జగదీశ్ రెడ్డి తొలిసారి ఇక్కణ్నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాసోజు శంకరమ్మకు టికెట్ ఇచ్చినా ఫలితం దక్కలేదు. తర్వా త జగదీశ్ రెడ్డి వర్గీయుడు సైదిరెడ్డిని పోటీకి దింపింది. కానీ భంగపాటు మాత్రం తప్పలేదు. 2015 నుంచి రాష్ట్రం లో జరిగిన ఉప ఎన్నికలన్నింటినీ అధికార పార్టీ గెలుచుకోడం ఒక్కటే కలిసొచ్చే అంశం. ఈక్రమంలో హుజూర్ నగర్ బై ఎలక్షన్ కు టఫ్ ఫైట్ తప్పదని స్పష్టమవుతోంది.