సంగారెడ్డి, వెలుగు: గ్రామీణ, జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులకు కాకా ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 టోర్నీ గొప్ప వేదిక అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లా స్థాయిలో మ్యాచ్లు నిర్వహిస్తూ క్రీడల అభివృద్ధికి మంత్రి వివేక్ కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విశాక ఇండస్ట్రీస్ తరఫున ఇలాంటి మ్యాచ్ లు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సింగపురం బీసీఆర్ క్రికెట్ గ్రౌండ్, చీమలదరి కోనాపూర్ ఎంఏ క్రికెట్ గ్రౌండ్ లో టోర్నీ 9వ రౌండ్ మ్యాచ్లను గురువారం ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించి మాట్లాడారు.
‘‘కాకా వెంకటస్వామి మెమోరియల్ ద్వారా జిల్లా స్థాయి మ్యాచ్లు నిర్వహిస్తున్నాం. గ్రామీణ, జిల్లా స్థాయి క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహిస్తున్నాం. క్రీడా స్ఫూర్తితో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులకు అభినందనలు’’అని వంశీకృష్ణ అన్నారు. తాత పేరును నిలబెడుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వంశీకృష్ణ సేవలు అభినందనీయమని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. కాకా మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులకు ఆమె అభినందించారు.
ఎంపీ వంశీకృష్ణతో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు. మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, మహబూబ్ నగర్ కార్యదర్శి రాజశేఖర్, కరీంనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగంరావు, హెచ్సీఏ ఇన్చార్జ్ భార్గవ్, తెలంగాణ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శులు, జిల్లా అసోషియేషన్ సభ్యులు శ్రీనాథ్ రెడ్డి, కోచ్‌లు కలీం, తౌహీద్, ఇనాం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
