
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఏజెంట్. ఈ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది సాక్షి వైద్య. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిన సాక్షి.. ఈ సినిమాలో హీరోయిన్గా చాన్స్ దక్కించుకుంది. కానీ, తొలి సినిమా రిజల్ట్ ఈ అమ్మడని నిరాశపరిచింది. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరెక్కించిన ఈ సినిమా.. మొదటి షో నుండే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. చిత్ర నిర్మాత అనిల్ సుంకర సైతం తాము కథపై పూర్తి శ్రద్ధ పెట్టలేదని తెలపడం చర్చనీయాంశంగా మారింది.
దీంతో సాక్షి తన ఆశలన్నీ రెండో సినిమాపైనే పెట్టుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్వకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘గాంఢీవధారి అర్జున’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్ హాలీవుడ్ సినిమాను తలపిస్తోంది. ప్రేక్షకుల నుండి కూడా ఈ పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఈ సాక్షి లీడ్ రోల్ చేస్తుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాతో తాను టాలీవుడ్లో బిజీ అవుతాననే కాన్ఫిడెన్స్‌తో ఉందట. మరో ఈ సినిమా అయిన సాక్షి కి అనుకున్న రిజల్ట్ ఇస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.