సుమ ఓటెవరికీ? ప్రీ రిలీజ్ ఫంక్షన్ల అయోమయం!

సుమ ఓటెవరికీ? ప్రీ రిలీజ్ ఫంక్షన్ల అయోమయం!

తెలుగు యాంకర్ సుమ(Anchor Suma)..టీవీ ప్రేక్షకులకు, సినిమా అభిమానులకు ఈ పేరు పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మాటలతో అందర్నీ కట్టి పడేస్తుంటోంది. సుమ షో చేస్తుందంటే.. ఇక అది హిట్ అన్నట్లే. ఎంతటి సెలబ్రిటీ అయినా సుమ పంచ్‌లకు పంచర్ అవ్వాల్సిందే. సుమ యాంకరింగ్ చేస్తున్నా.. ఏదైనా షోకు హోస్ట్‌గా వచ్చినా..ఆ షోలో గెస్ట్‌గా వెళ్లిన సెలబ్రిటీలంతా..ఆచి తూచి మాట్లాడాల్సిందే. మాటకు మాట సమాధానం ఇవ్వడంలో సుమను మించిన వారు లేదు.

ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్న అన్ని చిత్రాల ప్రీ రిలీజ్ ఫంక్షన్స్(Pre Release Events)కు సుమ యాంకరింగ్ అవసరం. ఇలా ప్రతి భారీ ఫంక్షన్కు..సుమ యాంకరింగ్ సెంటిమెంట్ అనే నానుడి ప్రతి ఒక్క మేకర్కి ఉంటోంది. మరి ఈసారి సుమ యాంకరింగ్ ఏ సినిమాకు ఉంటోంది. దాదాపు వచ్చే ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయోమయం అన్నట్లుగా ఉంది. దీంతో సుమ ఓటెవరికీ వేయబోతుందో చూద్దాం. 

గుంటూరు కారం(Guntur Karam Movie) ప్రీ రిలీజ్ ఫంక్షన్ను నిర్మాత జనవరి 6న జరపాలని అనుకుకున్నాడు. కానీ, పోలీసులు అనుమతి దొరకలేదు. వీరు జనవరి 6 డేట్ను ముందుగా అనుకున్నారు.  కాబట్టి హనుమాన్, సైంధవ్ (Saindhav) తమ డేట్స్ను కూడా సెట్ చేసుకున్నారు. హనుమాన్ (Hanuman) ప్రీ రిలీజ్ విషయానికి వస్తే..జనవరి 7న హైదరాబాద్లో జరపడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అంతేకాదు, మెగాస్టార్ చిరు గెస్ట్గా రాబోతున్నట్లు ప్రకటించారు.

అదే విధంగా జనవరి 7నే..హీరో వెంకటేష్ సైంధవ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఏర్పాటు చేసారు. అది విశాఖలో..ముందుగానే ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు. ఇదంతా ఒకే. ఏ ఫంక్షన్కి వచ్చే గెస్టులు ఆ ఫంక్షన్కి వస్తారు. దానిలో డౌట్ లేదు. అసలు సమస్య గుంటూరు కారం ప్రీ రిలీజ్ పోస్ట్పోన్ అవ్వడంతో షురూ అయ్యింది. ఒకవేళ కొత్త డేట్ ప్రకటించాలని మేకర్స్ డిసైడ్ అయిన ..జనవరి 7న జరుపుకోవాల్సిందే. ఎందుకంటే, జనవరి 8 సోమవారం వస్తుండటంతో..ఆడియన్స్కు హాలిడే అంటూ దొరకదు. ఇదిలా ఉంచితే..డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ గుంటూరు కారం సినిమా పై ఫ్యాన్స్లో ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ జనవరి 7న ప్రీ రిలీజ్ జరిగితే..యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు ఫోకస్ అంత మహేష్ సినిమాపై ఉంచితే..మరి హనుమాన్, సైంధవ్ ఫంక్షన్స్ను చూసేది ఎవరు? టెలికాస్ట్ చేసేది ఎవరు? అనే సందేహాలు కలుగుతున్నాయి.

అందులో ఒకేసారి మూడు ఫంక్షన్స్ ఒకేరోజు జరిగితే..సుమ యాంకరింగ్ ఎవరికీ? ఇప్పటికే సుమ లిస్టులో గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా జనవరి 7న జరిగే హనుమాన్ ప్రీ రిలీజ్కే సుమ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. దీంతో సుమ ఓటు హనుమాన్ కి అన్నమాట. 

  • Beta
Beta feature