
రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకే అనర్హులను టీఎస్ పీఎస్సీ బోర్డు మెంబర్లుగా నియమించారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గుమస్తా స్థాయి కూడా అర్హత లేని వారు గ్రూప్ 1 పరీక్షలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బోర్డు నియమకాల్లో అనర్హులను నియమిస్తే అల్లకల్లోలం జరుగుతుందని ముందే చెప్పామన్నారు రేవంత్ రెడ్డి. సరైన సూచనలను ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని.. ఇప్పుడు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కంప్యూటర్లతో పేపర్లు లీకేజీ అవుతుంటే ఐటీ మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్కు పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు, కవితకు సింగరేణిలు ఏటీఎంలుగా మారాయిన రేవంత్రెడ్డి ఆరోపించారు. సీఎం కార్యాలయంలో పనిచేసే వ్యక్తుల బంధువులే టీఎస్పీఎస్సీ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారని.. వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్ 1 పరీక్ష విషయంతో ప్రభుత్వం తప్పులను హైకోర్టు తప్పబట్టినా.. ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు రేవంత్ రెడ్డి.
కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం గానీ.. సరియైన నాయకుడిని తెచ్చుకోలేకపోయాం.. ఇకనైనా నిరుద్యోగులు, యువత ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు .