30 మంది మహిళలతో నక్సల్‌ వ్యతిరేక కమాండో ఏర్పాటు

30 మంది మహిళలతో నక్సల్‌ వ్యతిరేక కమాండో ఏర్పాటు

ఛత్తీస్‌గఢ్‌లో 30 మంది మహిళలతో నక్సల్స్‌ వ్యతిరేక కమాండో యూనిట్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన బస్తర్‌, దంతెవాడలలో నియమించారు. ఈ కమాండోకు ‘దంతేశ్వరి ఫైటర్స్‌’ అని పేరు పెట్టారు. కమాండో యూనిట్‌ను మొత్తం మహిళలతో ఏర్పాటు చేయడం ఇది మొదటి సారి. ఈ కమాండోకు DSP దినేశ్వరి నంద్‌ నేతృత్వం వహిస్తున్నారు.

గతేడాది బస్తర్ లోని  CRPF  ఈ ప్రాంతంలో నక్సలైట్ల ఆగడాలను అరికట్టేందుకు కొంత మంది యువకులతో ప్రత్యేకంగా టీం ను ఏర్పాటు చేశారు. ‘బస్తరియా బెటాలియన్’ పేరుతో ఆ కమాండ్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఆ టీంలో యువతులు, బాలికలను నియమించారు. వారు ఇప్పటికే ట్రైనింగ్ ను పూర్తి చేసుకున్నారు.