‘12ఏ రైల్వే కాలనీ’ స్ర్కీన్‌ప్లే బేస్డ్ చిత్రమని అల్లరి నరేష్ అన్నాడు. తను హీరోగా నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ చెప్పిన విశేషాలు.‘‘ఒక కొత్త జానర్ ట్రై చేద్దామనే టైమ్‌లో ఈ స్ర్కిప్ట్ విన్నా. ఇప్పటివరకు నేను సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. ఇందులో పారానార్మల్ టింజ్ చాలా బాగుంటుంది. హైదరాబాద్‌లో జరిగిన యదార్థ సంఘటన స్ఫూర్తితో, స్ర్కీన్‌ప్లే బేస్డ్‌గా అనిల్ విశ్వనాథ్ ఈ కథ రాశారు.
విజయ్ సేతుపతి ‘మహారాజా’ తరహాలో మూడు నాలుగు కథలు సమాంతరంగా జరుగుతుంటాయి. చాలా మైండ్ గేమ్ ఉంటుంది. ఇలాంటి స్క్రీన్‌ప్లేతో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా సక్సెస్ అయితే తప్పకుండా స్క్రీన్‌ప్లే గురించి మాట్లాడుకుంటారు. ‘పొలిమేర’ మేకర్స్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో బ్లాక్ మేజిక్, దెయ్యాలు ఉంటాయని కొందరు అనుకుంటున్నారు. అలాంటివేమీ ఇందులో ఉండవు.
దర్శకుడు నాని ఎడిటర్ కూడా కావడంతో పూర్తి క్లారిటీతో తీశాడు. కామాక్షి హీరోయిన్‌గా నటిస్తూనే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనూ వర్క్ చేసింది. భీమ్స్‌కు ఇలాంటి థ్రిల్లర్స్ ఫస్ట్ టైమ్ అయినా చాలెంజ్‌గా తీసుకుని ప్యాషన్‌తో వర్క్ చేశాడు. ఈ సినిమా విజయంపై టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రస్తుతం నాలుగు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. ‘ఆల్కహాల్’ జనవరిలో రిలీజ్ ఉంటుంది. ఇక నాకు ఒక హారర్ సినిమాతో పాటు ఒక మూకీ సినిమా చేయాలనుంది’’.
