Aa Okkati Adakku OTT: OTTకి వచ్చేసిన ఆ ఒక్కటి అడక్కు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aa Okkati Adakku OTT: OTTకి వచ్చేసిన ఆ ఒక్కటి అడక్కు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు(Aa okkati adakkuk). కొత్త దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో జాతిరత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు. టైటిల్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ. నిజానికి చాలా గ్యాప్ తరువాత అల్లరి నరేష్ చేసిన కామెడీ సినిమా ఇది. అందుకే ఈ సినిమాపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది.

కానీ, ఆ అంచనాలను అందుకోలేకపోయింది ఈ మూవీ. కలెక్షన్స్ మాత్రం ఓ మోస్తరుగానే రాబట్టింది. ఇక అప్పటినుండి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆడియన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో సినిమా మే 31నుండి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దీంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచినా ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఇక అల్లరి నరేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన బచ్చల మల్లి అనే సినిమా చేస్తున్నాడు. ఎనభై దశకంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుబ్బు. రా అండ్ రస్టిక్ గా వస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. మరి ఈ సినిమాతో అయినా అల్లరోడు హిట్టు కొడతాడా చూడాలి.