అల్లరి నరేష్ నుంచి మరో ప్రయోగాత్మక చిత్రం..ఆసక్తి పెంచేస్తోన్న టైటిల్ పోస్టర్

అల్లరి నరేష్ నుంచి మరో ప్రయోగాత్మక చిత్రం..ఆసక్తి పెంచేస్తోన్న టైటిల్ పోస్టర్

హీరో అల్లరి నరేష్..తనదైన కామెడీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో చేసిన ప్రతి సినిమా సక్సెస్ బాటలో పరుగెత్తేంది. ఇక ఈవీవీ మరణించడంతో అల్లరి నరేష్ కామెడీ చిత్రాలు అంతగా ఆకట్టులేకపోవడం వల్ల ఫ్యాన్స్ డిస్సపాయింట్ ఉన్న సమయంలో..ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనలో మరో కోణాన్ని బయటికి తీశాడు. 

ఇప్పుడు లేటెస్ట్గా అల్లరి నరేష్ (N63) వ సినిమా కూడా మరింత విభిన్నంగా ఉండబోతున్నట్లు ఒక క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. సాయి ధరమ్ హీరోగా సోలో బ్రతుకే సో బెటర్ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన సుబ్బు (Subbu)మంగాదేవితో నరేష్ తన 63 ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్తో మేకర్స్ అంచనాలు పెంచేశారు.

ఈ సినిమాకు బచ్చల మల్లి (Bacchalamalli) అనే పవర్ ఫుల్ టైటిల్ ను ప్రకటించారు. ఈ టైటిల్ లో పోస్టర్ లో పూర్తిగా లోడ్ చేయబడిన ట్రాక్టర్..లోయలో పడిపోతున్నట్లు.. కనిపిస్తోంది. ట్రాక్టర్‌పై విభిన్నంగా బచ్చలమల్లి అనే టైటిల్ రాసి ఉంది. 1990 బ్యాక్ డ్రాప్ లో సినిమా స్టోరీ ఉంటుందని..అలాగే అల్లరి నరేష్ సీరియస్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపిస్తోన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో నరేష్ కి జోడీగా అమృత అయ్యర్ కనిపిస్తోంది.

ఈ సినిమాకు సీతారామం ఫేమ్ విశాల్ చంద్ర శేఖర్ స్వరాలూ సమకూరుస్తున్నారు. ఈ బచ్చలమల్లి చిత్రంలో కోట జయరామ్, రావు రమేష్, సాయి కుమార్, ధనరాజ్, హరితేజ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తోన్నారు. 

ఇకపోతే నరేష్ గత చిత్రాలైన ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. దీంతో నరేష్ బచ్చలమల్లి మూవీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.