
నిర్మల్, వెలుగు: గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అన్ని శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నిర్మల్లోని పెన్షనర్స్ భవన్లో నగర గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. డీజే పర్మిషన్లు, రోడ్ల రిపేర్లు, కరెంట్ సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందించి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలన్నారు. పరస్పర సహకారంతో నిమజ్జనోత్సవం విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఉత్సవ సమితి అధ్యక్షుడు మూర్తి ప్రభాకర్, గౌరవ అధ్యక్షుడు పతికే రాజేందర్, బీజేపీ నేతలు రావుల రామనాథ్, మెడిసిమ్మ రాజు, అయ్యన్న గారి రాజేందర్, ఒడిసెల అర్జున్, ఆకుల కార్తీక్, ఎస్.సాయి, మాజీ కౌన్సిలర్లు, గణేశ్ మండళ్ల నిర్వాహకులు, బాధ్యులు పాల్గొన్నారు.
నిమజ్జనోత్సవాలకు పటిష్ట భద్రత
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్రాజర్షి షా, ఎస్పీ అఖిల్మహాజన్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, నిమజ్జనం చేసే స్థలాలను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అంతకుముందు స్థానిక పోలీస్హెడ్క్వార్టర్స్లో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహానికి సెకండ్ బెటాలియన్ కమాండెంట్ నితిక పంత్, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి అన్నదానం ఏర్పాటు చేయగా వారికి స్వయంగా వడ్డించారు.