
మెగా హీరో వరుణ్ తేజ్– లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ నిన్న హైదరాబాద్‌లోని నాగబాబు ఇంట్లో జరిగింది. రీల్ లైఫ్‌లో కలిసి నటించిన ఈ జంట రియల్ లైఫ్‌లోనూ ఒక్కటికానున్నారు. అయితే, రెండేళ్ల కిందటే లావణ్య మెగా ఇంటి కోడలు కాబోతోందని నిర్మాత అల్లు అరవింద్ సైతం హింట్ ఇచ్చారు. ఇంత చక్కని పిల్ల ఇక్కడే ఓ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆయన ఓ సినిమా ఫంక్షన్లో లావణ్యను ఆటపట్టించాడు.
ఈ వీడియోని నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. వరుణ్ లావణ్యలు తమ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎంగేజ్మెంట్ ఫొటోలు పోస్ట్ చేసిన వరుణ్ ‘నా ప్రేమను గెలుచుకున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. 2016లోనే తమ ప్రేమ మొదలైందని.. దానికి అంతం లేదంటూ లావణ్య ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.