నాకు కరోనా వచ్చింది: వీడియో విడుదల చేసిన అల్లు అరవింద్

నాకు కరోనా వచ్చింది: వీడియో విడుదల చేసిన అల్లు అరవింద్

హైదరాబాద్: నాకు కరోనా వచ్చిన మాట నిజమేనంటూ నిర్మాత అల్లుఅరవింద్ వీడియో విడుదల చేశారు. అయితే కొందరు సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తుండడాన్ని గుర్తించిన ఆయన క్లారిటీ ఇచ్చేందుకు వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కరోనా వచ్చిందని చాలా చోట్ల వార్తలు వచ్చాయి... వస్తున్నాయి..  అవును.. నాకు కరోనా వచ్చిన మాట నిజమే. కానీ రెండు వ్యాక్సిన్స్ వేయించుకున్న తర్వాత కూడా కరోనా వచ్చిందట అని రాస్తున్నారు.. అది మాత్రం నిజం కాదు. నేను కరోనా వ్యాక్సిన్ ఓ డోస్ మాత్రమే వేయించుకున్నాను.. ’’ అని చెప్పారు.  ఇంతకూ అసలు విషయం ఏంటంటే.. మేం ముగ్గురం స్నేహితులం కలిసి ఊరెళ్లొచ్చాం.. అప్పుడే కరోనా వచ్చింది.. మా ముగ్గురిలో ఇద్దరం వ్యాక్సిన్ వేయించుకున్నాం.. నాకు మూడు రోజులు లైట్‌గా జ్వరం వచ్చి తగ్గిపోయింది.. వ్యాక్సిన్ తీసుకోని స్నేహితుడు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నాడు.. అతన్ని చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా మంచిది అనే దానికి నేనే నిదర్శనం.. వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా వస్తుందంట కదా.. అంటే వస్తుంది కానీ చాలా లైట్‌గా వచ్చి వెళ్లిపోతుంది.. అందుకే  అందరూ నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోండి.. కొన్నిసార్లు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వచ్చినా.. వచ్చెళ్లిపోతుందంతే కానీ ప్రాణహాని ఉండదు.. నా స్నేహితుడు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు.. నేను వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా లైట్‌గానే ఉంది.. అందుకే తప్పకుండా అంతా వ్యాక్సిన్ వేయించుకోండి..’ అంటూ తెలిపారు.