దేవర సినిమాలో అల్లు అర్హ.. రెండో సినిమాకే భారీ రెమ్యునరేషన్

దేవర సినిమాలో అల్లు అర్హ.. రెండో సినిమాకే భారీ రెమ్యునరేషన్

శాకుంతలం(Shakunthalam) సినిమాలో చిన్నప్పటి భరతుడిగా కనిపించి ఆడియన్స్ ను మెస్పరైజ్ చేసింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) కూతురు అల్లు అర్హ(Allu arha). ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.  సమంత(Samantha) ప్రధాన పాత్రలో వచ్చిన శాకుంతలం సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. అల్లు అర్హ పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కేవలం అల్లు అర్హ కోసమే ఈ సినిమా చూసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. 

ఇక తాజాగా మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమైంది ఈ అల్లు వారి పాప. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో దేవర(Devara) సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం అర్హ ను తీసుకుంటున్నారట మేకర్స్. అంతేకాదు ఇందుకోసం అర్హకు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. దేవర సినిమాలో కేవలం పది నిమిషాల పాత్ర కోసం అర్హకు రూ.20 లక్షలు ఇస్తున్నారట. చైల్డ్ ఆరిస్టుల్లో  అది రెండో సినిమాకే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ కిడ్ గా రికార్డ్ క్రియెట్ చేసిందట అర్హ. ఇక ఈ సినిమాలో అర్హ జాన్వీ(Janhvi kapoor) చిన్నప్పటి పాత్రలో కనిపించనుందని సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంతా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.