రష్యాలో.. పుష్ప మేనియా

రష్యాలో.. పుష్ప మేనియా

‘పుష్ప’ సినిమా వచ్చి ఏడాది అవుతోంది. ఎప్పుడెప్పుడు సీక్వెల్ షూట్ మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరోవైపు ‘పుష్ప’ మేనియా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 8న రష్యాలో ఈ సినిమా విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్‌‌‌‌ కోసం రష్యా వెళ్లిన టీమ్, అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్‌‌‌‌తో పాటు హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలలో ఒకరైన రవిశంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ప్రెస్‌‌‌‌ మీట్స్‌‌‌‌లో పాల్గొన్నారు.

రష్యన్‌‌‌‌ భాషలో మాట్లాడి అక్కడి వారిని ఆశ్చర్యపరిచాడు బన్నీ. ఈ సినిమాలోని ఫేమస్‌‌‌‌ డైలాగ్స్‌‌‌‌ను రష్యన్‌‌‌‌లో చెప్పడంతో పాటు ప్రపంచంలో తనకు నచ్చిన ప్లేస్ రష్యా అన్నాడు.  గురువారం మాస్కోలో స్పెషల్ ప్రీమియర్ ఏర్పాటు చేయగా టీమ్ అంతా అటెండ్ అయ్యారు. 3న సెయింట్ పీటర్స్ బర్గ్‌‌‌‌లో ప్రీమియర్ షో ఉంది. ఇదిలా ఉంటే రష్యా నుండి రాగానే ‘పుష్ప 2’ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు సుకుమార్. కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో వచ్చి హిట్ అందుకున్న టీమ్, వచ్చే యేడాది ఇదే నెలలో సీక్వెల్‌‌‌‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది.