V6 News

అల్లు అర్జున్ రాకాలో దీపిక ఉన్నట్టేనా..?

అల్లు అర్జున్  రాకాలో దీపిక ఉన్నట్టేనా..?

అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రాకా’. సన్ పిక్చర్స్‌‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌‌ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌‌గా నటిస్తోంది. అయితే ఇటీవల ఆమె తన రెండో ప్రెగ్నెన్సీని ప్రకటించింది.  ఈ నేపథ్యంలో సినిమాలో ఆమె చేయాల్సిన యాక్షన్ సీక్వెన్స్‌‌ల విషయంలో మూవీ టీమ్ ఆందోళన చెందుతోందని, తన పాత్ర నిడివిని తగ్గించి కేవలం టాకీపార్ట్‌‌కే పరిమితం చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అంతేకాదు ఆమె స్థానంలో మరో హీరోయిన్‌‌ను వెతుకుతున్నారని కూడా వార్తలొచ్చాయి.  ఈ ప్రచారం ముదురుతుండడంతో మేకర్స్‌‌ స్పందించారు.  దీపికా ఈ సినిమా నుండి తప్పుకున్నారనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.  ఆమె పాత్రను కుదించడం,  తన ప్లేస్‌‌లో మరొకరిని తీసుకోవడం లాంటి మార్పులేవీ లేవని స్పష్టం చేశారు. ప్రెగ్నెన్సీతో ఉండి కూడా దీపిక కొన్ని యాక్షన్ సీన్స్‌‌ చేయబోతోందని, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతుందని తెలియజేశారు.