నెక్ట్స్ ఏంటి  పుష్పా!

నెక్ట్స్ ఏంటి  పుష్పా!

‘అల వైకుంఠపురములో’ సినిమా సృష్టించిన రికార్డుల్ని మర్చిపోయేలోపే ‘పుష్ప’తో సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. ముఖ్యంగా బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ మూవీతో వచ్చిన వైబ్రేషన్స్ సామాన్యమైనవి కావు. తమ సినిమాల్ని పక్కకు నెట్టి మరీ ‘పుష్ప’ని చూశారు బీటౌన్ ప్రేక్షకులు. దాంతో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్సాఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర వంద కోట్లు కొల్లగొట్టిందీ మూవీ. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా యాభై రోజుల్లో మూడొందల అరవై అయిదు కోట్ల గ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వసూలు చేసింది. ఈ విషయాన్ని టీమ్ గర్వంగా ప్రకటించింది. ఇది మామూలు సంచలనం కాదంటూ దేశవ్యాప్తంగా  కాంప్లిమెంట్స్ కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే బన్నీ నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నాడనే విషయంలోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సెకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తాడని కొందరు అంటుంటే.. ఎప్పటి నుంచో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ‘ఐకాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రాన్ని స్టార్ట్ చేస్తున్నాడని మరికొందరు చెబుతున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బన్నీయే రాస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  మరోవైపు బోయపాటితో ఓ సినిమాకి కమిటయ్యాడనే టాక్ కూడా ఉంది. దాంతో కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్యూజ్ అవుతున్న ఫ్యాన్స్.. నెక్స్ట్ ఏంటి పుష్పా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘పుష్ప 2’ పైనే బన్నీ దృష్టి పెట్టే చాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.