పుష్ప సెకెండ్ పార్ట్ సాంగ్స్‌‌ అంతకుమించి

పుష్ప సెకెండ్ పార్ట్ సాంగ్స్‌‌ అంతకుమించి

‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్‌‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. విడుదలైన అన్ని భాషల్లో సినిమా సెన్సేషనల్ హిట్‌‌ అవడంతో  పార్ట్‌‌2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే షూట్ స్టార్ట్ చేయాల్సి ఉంది కానీ కొన్ని కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. రీసెంట్‌‌గా స్క్రిప్ట్, లొకేషన్స్‌‌ గురించి టీమ్ అంతా చర్చించుకున్నారు. ఈ నెలాఖరు లోపు ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఏప్రిల్​లో సెట్స్‌‌కి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బన్నీ రిషికేష్‌‌ పర్యటనలో ఉన్నాడు. తిరిగి రాగానే ఫైనల్ సిట్టింగ్‌‌ వేసి, వీలైనంత త్వరగా సెట్స్‌‌కి వెళ్లిపోవాలనేది ప్లాన్. ఫస్ట్ పార్ట్‌‌ విషయంలో ప్లానింగ్ కాస్త తేడా కొట్టడంతో.. చివరి నిమిషంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈసారి అలా జరగకుండా పక్కా ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇక సాంగ్స్‌‌ గురించి ఇప్పటికే  దేవిశ్రీతో సిట్టింగ్స్‌‌లో పాల్గొన్నారు సుకుమార్.  ఫస్ట్ పార్ట్ పాటలు  రికార్డ్స్‌‌ క్రియేట్ చేయడంతో సెకెండ్ పార్ట్ సాంగ్స్‌‌ అంతకుమించి ఉండేలా రెడీ చేస్తున్నాడట దేవి. ఇదిలా ఉంటే బన్నీ  చేయా ల్సిన ‘ఐకాన్’ మూవీ విషయంలో కన్‌‌ఫ్యూజన్ ఇంకా తీరలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. బన్నీ కూడా ఆసక్తి చూపించట్లేదని, అందుకే ఈ ప్రాజెక్ట్ రామ్ చేతికి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది.