
రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. 17ఎంపీ స్థానాలలో జరుగుతున్న ఎన్నికలలో ఓటర్లు ఉదయం నుంచే పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో సినీ రంగానికి చెందిన పలువురు ఓటింగ్ లో పాల్గొన్నారు.
మెగా స్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యలుతో కలిసి ఓటును వేశారు. చిరంజీవి, రామ్‌చరణ్, సురేఖ, ఉపాసనలు జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు వేశారు.
నందమూరి హీరో జూ.ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మెగా హీరో అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.33లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌లో ఓటు వేశారు. ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు వస్తుందని అన్నారు అర్జున్.
అక్కినేని అమల తన ఓటును వేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. పోలింగ్ ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు. వీరితో పాటు సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ఓటు హక్కును వినియోగించుకున్నారు.